పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : యతులీశ్వరుని (1-274-క.)

1-274-క.

తులీశ్వరుని మహత్త్వము
మిమెఱుఁగని భంగిఁ నప్రమేయుఁడగు హరి
స్థితినెఱుఁగక కాముకుఁ డని
ములు సలుపుదురు తిగిచి మణులు సుమతీ!

టీకా:

యతులు = ఇంద్రియములను నియమించినవారు; ఈశ్వరుని = కృష్ణుని; మహత్త్వము = గొప్పదనము యొక్క; మితమున్ = పరిమాణమును / హద్దులను; ఎఱుఁగని = తెలిసికొనలేని; భంగిన్ = విధముగ; అప్రమేయుఁడు = మితము లేనివాడు; అగు = అయినట్టి; హరి = కృష్ణుని; స్థితిన్ = స్థితిని; ఎఱుఁగకన్ = తెలిసికొనలేక; కాముకుఁడు = కామ ప్రకోపముతో నుండువాడు; అని = అని; రతములు = సురతములు; సలుపుదురు = చేయుదురు; తిగిచి = ఆకర్షించి; రమణులు = స్త్రీలు; సుమతీ = మంచి బుద్ధి కలవాడా.

భావము:

ఓ బుద్దిమంతుడైన శౌనకా! తపోనియతులైన యతులు పరమేశ్వరుని ప్రభావం ఇదమిత్థమని ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్త్వన్ని గుర్తించకుండా కాముకుడనే భావంతో రమణులందరూ ఆ రమారమణునితో క్రీడించారు.