పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : విజయ (1-371-క.)

1-371-క.

వియ, ధనంజయ, హనుమ
ద్ధ్వ,ఫల్గున, పార్థ, పాండునయ, నర, మహేం
ద్ర,మిత్రార్జున, యంచును
భుములు దలకడవ రాకపోకలఁ జీరున్.

టీకా:

విజయ = అర్జున {విజయ - విజయము కలవాడు, అర్జున}; ధనంజయ = అర్జున {ధనంజయ - (దిగ్విజయమున) ధనమును గెలిచిన వాడు, అర్జున }; హనుమద్ధ్వజ = అర్జున {హనుమద్వజ - హనుమంతుని జండాపై కలవాడు, అర్జున }; ఫల్గున = అర్జున {ఫల్గుణా - వేగముగా పోవు వాడా, అర్జున }; పార్థ = అర్జున {పృథాదేవి (కుంతి) పుత్రుడా, అర్జున}; పాండుతనయ = అర్జున {పాండుతనయా - పాండురాజు పుత్రా, అర్జున }; నర = అర్జున {నర - నరనారాయణులలో నరుడా, అర్జున}; మహేంద్రజ = అర్జున {మహేంద్రజ - మహేంద్రుని పుత్రా, అర్జున}; మిత్ర = అర్జున {మిత్రా - మిత్రుడా, కొలతవేయుటలో నేర్పరి, అర్జున}; అర్జున = అర్జున {అర్జునా - తెల్లని వాడా, అర్జున}; అంచును = అనుచును; భుజములున్ = చేతులు; తలకడవన్ = అతిక్రమించగా, చాచి; రాకపోకలన్ = రాకపోకలందు; చీరున్ = పిలుచును.

భావము:

అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా చేతులు చాచి ఆప్యాయంగా తట్టుతు విజయ, ధనంజయ, హనుమద్ధ్వజ, ఫల్గున, పార్థ, పాండుతనయ, నర, మహేంద్రజ, మిత్రార్జున అంటు రకరకాలుగా చనువుగా నన్ను పిలిచేవాడు కదా.

    అంటు అర్జునుడు అన్నగారు ధర్మరాజునకు శ్రీకృష్ణనిర్యాణం చెప్పుతు కృష్ణుని తలచాడు.