పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వచ్చెదరదె (10.1-1756-క.)

10.1-1756-క.

చ్చెద రదె యదువీరులు
వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్
నొచ్చెదరును విచ్చెదరును
చ్చెదరును నేడు చూడు లజాతాక్షీ!

టీకా:

వచ్చెదరు = ముందుకువస్తున్నారు; అదె = అదిగో; యదు = యాదవ; వీరులు = సైనితులు; వ్రచ్చెదరు = భేదించెదరు; అరి = శత్రు; సేనన్ = సైన్యను; ఎల్లన్ = అంతటిని; వైరులున్ = శత్రువులను; పెలుచన్ = మిక్కుటముగ; నొచ్చెదరు = దెబ్బతినెదరు; విచ్చెదరును = చెల్లాచెదురు అగుదురు; చచ్చెదరును = మరణించెదరు; నేడు = ఇవాళ; జలజాతాక్షీ = పద్మాక్షీ, రుక్మిణి.

భావము:

రుక్మిణీ కల్యాణం ఘట్టంలోదిది. ప్రాస ద్విత్వాక్షరం ‘చ్ఛె’తో బాటు ‘ద’ మరియు ‘రకారం’ నాలుగు పాదాలలో ప్రయోగించిన యీ కందపద్యం నడక ఎంతో బావుంది. జరాసంధాదులు అడ్డుకుంటుంటే, తీసుకెళ్తున్న శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి ధైర్యం చెప్తున్నాడు –

    ఓ సరోజా ల్లాంటి కళ్ళున్న రుక్మిణీదేవి! చూస్తూ ఉండు ఇదిగో మన యాదవ వీరులు ముందుకు వచ్చి శత్రుమూకలను చీల్చి చెండాడుతారు; శత్రువులు యివేళ బాగా దెబ్బతింటారు; చెల్లా చెదురై, చస్తారు.