పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : శ్రీమన్నామ (8-1-క.)

8-1-క.

శ్రీన్నామ! పయోద
శ్యా!ధరాభృల్లలామ! గదభిరామా!
రామాజనకామ! మహో
ద్ధా!గుణస్తోమధామ! శరథరామా!

టీకా:

శ్రీమన్నామ = శ్రీరామ {శ్రీమన్నాముడు - శ్రీమత్ (మంగళవంతమైన) నామ (పేరుగలవాడు), రాముడు}; పయోదశ్యామ = శ్రీరామ {పయోదశ్యాముడు - పయోద (మేఘము వంటి) శ్యామ (నల్లనివాడు), రాముడు}; ధరాభృల్లలామ = శ్రీరామ {ధరాభృల్లలాముడు - ధరాభృత్ (రాజులలో) లలాముడు (శ్రేష్ఠమైనవాడు), రాముడు}; జగదభిరామ = శ్రీరామ {జగదభిరాముడు - జగత్ (లోకములకు) రాముడు (అందమైనవాడు), రాముడు}; రామాజనకామ = శ్రీరామ {రామాజనకాముడు - రామా (రమించునట్టివారైన, స్త్రీ) జన (జనులకు) కాముడు (మన్మథునివంటివాడు), రాముడు}; మహోద్ధామ = శ్రీరామ {మహోద్ధాముడు - మహా (గొప్ప) ఉద్ధాముడు (ఉద్ధరించెడివాడు), రాముడు}; గుణస్తోమధామ = శ్రీరామ {గుణస్తోమధాముడు - గుణస్తోమ (సుగుణములకు) ధాముడు (నెలవైనవాడు), రాముడు}; దశరథరామా = శ్రీరామ {దశరథరాముడు - దశరథుని యొక్క కుమారుడైన రాముడు (ఆనందింపజేయువాడు), రాముడు}.

భావము:

అష్టమ స్కంధారంభలోని ప్రార్థన! –

 మంగళకర మైన పేరు కలవాడా! మేఘం వంటి కాంతివంత మైన దేహం కలవాడా! రాజులలో బహు గొప్పవాడా! ఆఖిల లోకాలలో అంద మైన వాడా! స్త్రీలకు మన్మథుని వంటి వాడా! బహు గంభీర మైన వాడా! సుగుణాలనే సంపదలకు నిలయ మైన వాడా! దశరథ కుమారు డైన శ్రీరామ చంద్రా! అవధరించు!