పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : శ్రీమహిత (3-1-క.)

3-1-క.

శ్రీహిత వినుత దివిజ
స్తో!యశస్సీమ! రాజసోమ! సుమేరు
స్థే!వినిర్జితభార్గవ
రా!దశాననవిరామ! ఘుకులరామా!

టీకా:

శ్రీ = శుభకరమైన; మహిత = మహిమకలవాడ; వినుత = పొగడున్న; దివిజ = దేవతల {దివిజులు - స్వర్గమున ఉండువారు, దేవతలు}; స్తోమ = సమూహముకలవాడ; యశః = కీర్తికి; సీమ = హద్దు యైనవాడ; రాజ = రాజులలో; సోమ = చంద్రుడా; సుమేరు = మేరుపర్వతము వలె; స్థేమ = స్థిరమైనస్వభావముకలవాడ; వినిర్జిత = చక్కగా జయింపబడిన; భార్గవరామ = పరశురాముడు కలవాడ {భార్గవరాముడ - భర్గుని యొక్క రాముడు}; దశానన = రావణుని {దశానన - పది తలలుకలవాడు, రావణుడు}; విరామ = సంహరించినవాడ; రఘుకులరామ = రఘురామ {రఘుకులరాముడు - రఘు వంశపు రాముడు}.

భావము:

శ్రీరామా! శ్రీకరమైన మహిమ కలవాడ! దేవతలుచే సంస్తుతింపబడు వాడ! దిగ్దిగంతాల వరకు వ్యాపించే యశస్సు కలవాడ! చంద్రుని వలె చల్లని పరిపాలన చేయువాడ! మేరునగ ధీరుడ! పరశురాము డంతటి వాని విచిత్రంగా భంగపరచిన శూరుడ! పది తలల రావణాసురుని తుదముట్టించిన వీరాధివీరుడ! రఘువంశోద్ధారక రామ! అవధరించు.