పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : శ్రీమద్విఖ్యాతి (7-1-క.)

7-1-క.

శ్రీ ద్విఖ్యాతిలతా
క్రామితరోదోంతరాళ! మనీయమహా
జీమూతతులితదేహ
శ్యాలరుచిజాల! రామచంద్రనృపాలా!

టీకా:

శ్రీమత్ = సంపద్యుక్తమైన; విఖ్యాతి = కీర్తియనెడి; లతా = తీగచే; ఆక్రామిత = అల్లుకొనబడిన; రోదస్ = భూమ్యాకాశములు; అంతరాళ = అందలి ప్రదేశములుగలవాడ; కమనీయ = చూడచక్కని; మహా = గొప్ప; జీమూత = మేఘములతో; తులిత = సరిపోలెడి; దేహ = శరీరపు; శ్యామల = నల్లని; రుచిర = కాంతుల; జాల = సమూహములుగలవాడ; రామచంద్ర = శ్రీరామచంద్ర; నృపాల = మహారాజ.

భావము:

చక్కటి కీర్తిలతలు లోకమంతా వ్యాపించిన వాడా! నీలి మేఘఛాయను పోలెడి మేనివాడ! శ్రీరామచంద్రమహారాజా!