పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : శ్రీమద్భక్తచకోరక (2-1-క.)

2-1-క.

శ్రీద్భక్త చకోరక
సో!వివేకాభిరామ! సురవినుత గుణ
స్తో!నిరలంకృతాసుర
రామాసీమంతసీమ! రాఘవరామా!

టీకా:

శ్రీమత్ = గొప్పవారైన; భక్త = భక్తులు అను; చకోరక = చకోరపక్షులకు; సోమ = చంద్రుడా; వివేక = వివేకమువలన; అభిరామ = సుందరమైనవాడా; సుర = దేవతలచే; వినుత = పొగడబడుచున్న; గుణ = గుణముల; స్తోమ = సమూహముగలవాడా; నిరలంకృత = నష్టమైన అలంకారములు గల; అసుర = రాక్షస; రామా = స్త్రీల; సీమంత = పాపిటలు; సీమ = ప్రాంతము కలగజేసినవాడా; రాఘవ = రఘువంశమున జన్మించిన; రామా = రాముడా.

భక్తులు అనెడి చకోరక పక్షులకు చంద్రుని వంటివాడా! వివేకముతో విలసిల్లు వాడా! దేవతలచేత పొగడబడిన సుగుణములు గలవాడా! (రాక్షసులను సంహరించి) రాక్షస స్త్రీల పాపిట సింధూరాలంకరణలు తొలగించిన వాడ! రఘు వంశోద్భవుడవైన శ్రీరామచంద్రప్రభూ! అవధరింపుము.