పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : సర్వేశుడు (6-220-క.)

6-220-క.

ర్వేశుఁడు సర్వాత్ముఁడు
ర్వగతుం డచ్యుతుండు ర్వమయుండై
ర్వంబుఁ జేరి కొలువఁగ
ర్వగుఁడై దక్షునకుఁ బ్రన్నుం డయ్యెన్.

టీకా:

సర్వేశుడు = నారాయణుడు {సర్వేశుడు - సర్వ (సమస్తమునకు) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; సర్వాత్ముడు = నారాయణుడు {సర్వాత్ముడు - సర్వ (అఖిల జీవులకు) ఆత్ముడు (అంతరాత్మ యైన వాడు), విష్ణువు}; సర్వ గతుండు = నారాయణుడు {సర్వగతుడు - సర్వ (సమస్త మందు) గతుడు (ఉండెడి వాడు), విష్ణువు}; అచ్యుతుండు = నారాయణుడు {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేని వాడు, విష్ణువు}; సర్వ మయుండు = సర్వము నందు నిండిన వాడు {సర్వ మయుడు - సర్వమునందు నిండిన వాడు, విష్ణువు}; ఐ = అయ్యి; సర్వంబు = అందరు; చేరి = పూని; కొలువగన్ = సేవిస్తుండగా; సర్వగుడు = సర్వము నందు వ్యాపించినవాడు {సర్వగుడు - సర్వమునందు వ్యాపించినవాడు, విష్ణువు}; ఐ = అయ్యి; దక్షున్ = దక్షుని; కున్ = కి; ప్రసన్నుడు = ప్రత్యక్షము; అయ్యెన్ = అయ్యెను.

భావము:

పునరుజ్జీవితు డైన దక్షుడు తాను చేసిన సృష్టికి సంతుష్టి చెందక శ్రీహరిని గూర్చి హంసగుహ్య స్తవరాజం కావించగా –

    సర్వమునకు ప్రభువు అయిన వాడు, సర్వము తానే అయినవాడు, సర్వు లందలి అంతరాత్మ అయిన వాడు సర్వాంతర్యామి అయ్యి సమస్త పరివారము సేవిస్తుండగా సమస్త మందు వ్యాపించిన వాడై పొరపడు టన్నది లేని శ్రీమహావిష్ణువు దక్షునకు దర్శన మిచ్చాడు.