పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : సరసిం బాసిన (1-64-మ.)

1-64-మ.

సిం బాసిన వేయు కాలువల యోజన్విష్ణునం దైన శ్రీ
నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సులున్ బ్రాహ్మణసంయమీంద్రులు మహర్షుల్విష్ణునంశాంశజుల్
రికృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దావిష్ణుఁడౌ నేర్పడన్.

టీకా:

సరసిన్ = సరస్సు నుండి; పాసిన = వెలువడిన; వేయు = అనేకము లైన / వెయ్యి; కాలువల = కాలువల; యోజన్ = వలె; విష్ణుని = హరి; అందైన = నుండి ఉద్భవించిన; శ్రీకర = శుభములు కలిగించు; నానా = అనేక విధముల; ప్రకట = అభివ్యక్త మైన; అవతారములు = పుట్టుటలు; అసంఖ్యాతంబులు = లెక్కకు మిక్కిలినవి; ఉర్వీశులు = రాజులు {భూమి పతులు, రాజులు}; సురలున్ = దేవతలు; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; సంయమ = జితేంద్రియులలో; ఇంద్రులు = శ్రేష్టులు; మహా = గొప్ప; ఋషుల్ = ఋషులు; విష్ణుని = హరియొక్క; అంశాంశ = సూక్ష్మఅంశలతో; అజులు = పుట్టిన వారు; హరి = హరి; కృష్ణుండు = కృష్ణుడు; బల = బలరామునికి; అనుజన్ముఁడు = తోబుట్టువు వలె; ఎడల లేదా = వచ్చాడు కదా; విష్ణుఁ డౌ = హరి యై; ఏర్పడన్ = ఉండగా.

భావము:

ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలవలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే శ్రీమన్నారాయణుని లోనుంచి విశ్వశ్రేయో దాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి. రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు, ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే. పూర్వం బలరామునిగా అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా.