పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : సంతసమింతలేదు (1-210-ఉ.)

1-210-ఉ.

సంస మింత లేదుమృగశాపవశంబునఁ బాండు భూవిభుం
డంము నొందియుండ మిము ర్భకులం గొనివచ్చి కాంక్షతో
నింలవారిఁగాఁ బెనిచె నెన్నఁడు సౌఖ్యముపట్టు గాన దీ
గొంతియనేక దుఃఖములఁ గుందుచు నుండునుభాగ్య మెట్టిదో.

టీకా:

సంతసము = సంతోషము; ఇంతన్ = కొంచెము కూడ; లేదు = లేదు; మృగ = మృగము యొక్క; శాప = శాపము; వశంబునన్ = వలన; పాండు = పాండు; భూవిభుండు = రాజు; అంతమున్ = మరణమును; ఒంది = పొంది; ఉండన్ = ఉండగ; మిమున్ = మిమ్ములను; అర్భకులన్ = పసిబిడ్ఢలను; కొనివచ్చి = తీసుకొనివచ్చి; కాంక్ష = బలీయమైన కోరిక; తోన్ = తో; ఇంతలవారిఁగాన్ = ఇంతవారిగ; పెనిచెన్ = పెంచినది; ఎన్నఁడున్ = ఎప్పుడుకూడ; సౌఖ్యము = సుఖము; పట్టున్ = ఒక్కపట్టు కూడ / రవ్వంతయైన; కానదు = ఎరుగదు; ఈ = ఈ; గొంతి = కుంతి {గొంతి - కుంతి - కుంతల దేశ ఇంతి}; అనేక = అనేకమైన; దుఃఖములన్ = బాధలతో; కుందుచున్ = కృంగిపోతూ; ఉండును = ఉంటుంది; భాగ్యము = అదృష్టము; ఎట్టిదో = ఎలాంటిదో.

భావము:

పాపం! మీ తల్లి కుంతీదేవికి సంతోషం రవ్వంతైనా లేదు. పాండురాజు మృగరూపంలో ఉన్న ముని శాపకారణం వలన మరణించడంతో పసికందులైన మిమ్ములను అరచేతిలో పెట్టుకొని పెంచుకొచ్చింది. యింతవాళ్ళని చేసింది. ఏ ఒక్కరోజు సౌఖ్యమన్న మాట ఎరుగదు. ఈవిడ దురదృష్టం ఎలాంటిదో కాని జీవితమంతా కష్టాలతో కాపరం గానే గడిచింది.