పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పుష్కరంబందు (12-46-తే.)

12-46-తే.

పుష్కరం బందు ద్వారకాపురము నందు
థుర యందును రవిదిన మందు నెవఁడు
ఠన సేయును రమణతో భాగవతము
వాఁడు తరియించు సంసారవార్ధి నపుడ.

టీకా:

పుష్కరంబు = పుష్కరతీర్థం; అందున్ = లో; ద్వారకాపురము = ద్వారకాపట్టణము; అందున్ = లో; మథుర = మథురానగరం; అందును = లోను; రవిదినము = ఆదివారము; అందున్ = లోను; ఎవడు = ఎవరైతే; పఠన = చదువుట; చేయున్ = చేస్తాడో; రమణ = ఆసక్తిపూర్వకంగా; భగవతమున్ = భాగవతమును; వాడు = అట్టివాడు; తరియించున్ = దాటును; సంసార = సంసారమనెడు; వార్ధిన్ = సముద్రమును; అపుడ = ఆ సమయమునందే.

భావము:

పుష్కర తీర్థంలోకాని, ద్వారకానగరంలోకాని, మథురలోకాని, ఆదివారం నాడు ప్రీతిగా భాగవతాన్ని చదివిన వారు అప్పటి కప్పుడే సంసార సముద్రాన్ని తరిస్తారు,