పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పెట్టిరి (3-13-క.)

3-13-క.

పెట్టిరి విషాన్న; మంటం
ట్టిరి ఘనపాశములను; గంగానదిలో
నెట్టిరి; రాజ్యము వెడలం
గొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై.

టీకా:

పెట్టిరి = పెట్టిరి; విష = విషము కలిపిన; అన్నమున్ = భోజనమును; అంటన్ = గట్టిగా; కట్టిరి = కట్టివేసిరి; ఘన = పెద్ద; పాశములన్ = తాళ్ళతో; గంగా = గంగ అను; నది = నది; లోన్ = లోనికి; నెట్టిరి = తోసివేసిరి; రాజ్యమున్ = రాజ్యమునుండి; వెడలంగొట్టిరి = గెంటివేసిరి; ధర్మంబు = ధర్మమును; విడిచి = విడిచిపెట్టి; కుటిల = వంకర; ఆత్మకులు = స్వభావము కలవారు; ఐ = అయ్యి.

భావము:

శుకుడు పరీక్షిత్తునకు అసూయా మగ్ను లైన కౌరవులు పాండవుల యెడ చూపిన దుష్టత్వం సూచిస్తున్నాడు –

    ధర్మదూరులు కుటిల బుద్దులు అయ్యి విషం కలిపిన అన్నం పెట్టారు. పెద్ద పెద్ద తాళ్ళతో కట్టారు, గంగానదిలోకి నెట్టారు. రాజ్యంనుండి వెళ్ళ గొట్టారు.