పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పర్వతద్వంద్వంబు (10.2-733-సీ.)

10.2-733-సీ.

ర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు;
మృగపతిద్వితయంబు వృషభయుగము
పావకద్వయము దంతావళయుగళంబు;
లపడు వీఁక నుద్దండలీలఁ
దిసి యన్యోన్యభీరగదాహతులను;
గ్రంబుగ విస్ఫులింములు సెదరఁ
గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమ;
ములను సింహచంక్రమణములను

10.2-733.1-తే.

దిసి పాయుచు డాసి డగ్గఱచు మింటి
కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి
గుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర
నగదాఘట్టనధ్వని గనమగల.

టీకా:

పర్వత = కొండల; ద్వంద్వంబున్ = జంట; పాథోధి = సముద్రముల; యుగళంబు = జంట; మృగపతి = సింహములు; ద్వితయంబున్ = రెండు; వృషభ = ఆబోతులు; యుగమున్ = జత; పావక = అగ్నులు; ద్వయమున్ = రెండు; దంతావళ = ఎనుగుల; యుగళంబున్ = రెండు; తలపడు = పోరాడు; వీకను = రీతిని; ఉద్దండ = అతిశయముకల; లీలన్ = విధముగా; కదిసి = చేరి; అన్యోన్య = ఒకరినొకరు; భీకర = భయంకరమైన; గదా = గదల; ఆహతులను = కొట్టుటలుచేత; ఉగ్రంబుగన్ = భయంకరముగ; విస్ఫులింగములు = అగ్నిరవ్వలు; చెదరన్ = రాలగా; కెరలుచున్ = చెలరేగుచు; సవ్య = కుడినుండి ఎడమకు; దక్షిణ = ఎడమనుండి కుడికి; మండల = గుండ్రముగా; భ్రమణములను = తిరుగుటలు; సింహచంక్రమణములను = సింహమువలె దూకుటలు చేత;
కదిసి = దగ్గరకువచ్చి; పాయుచున్ = తొలగిపోతూ; పాసి = తొలగి; డగ్గఱచున్ = దగ్గరకువస్తూ; మింటి = ఆకాశమున; కిన్ = కు; ఎగసి = ఎగిరి; క్రుంగుచున్ = వంగిపోతూ; క్రుంగి = వంగిపోయి; వేన్ = వేగముగా; ఎగసి = పైకి ఎగిరి; భూమిన్ = నేల; పగులన్ = బద్ధలయ్యేలా; ఆర్చి = బొబ్బపెట్టి; ఛటత్ = ఛట; ఛటత్ = ఛట అను; ఉద్భట = అధికమైన; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; ఘన = పెద్ద; గదా = గదతోటి; ఘట్టన = కొట్టిన; ధ్వనిన్ = శబ్దము వలన; గగనము = ఆకాశము; అగలన్ = భేదిలిలగా.

భావము:

భీమ జరాసంధులు ఇద్దరు ఘోరంగా పోరుతున్నారు. అది ఎలా ఉందంటే –

    రెండు పర్వతాలు, రెండు సముద్రాలు, రెండు వృభాలు, రెండు అగ్నులు, రెండు మదించిన ఏనుగులు ఒకదానితో ఒకటి భయంకరంగా తలపడుతున్నట్లుగా ఉంది. విజృంభించి సింహనాదాలు చేస్తున్నారు పై కెగురుతున్నారు, భూమి పగిలిపోయేలా నేలపైకి దూకుతున్నారు, ఒకళ్ళ నొకళ్ళు తోసుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. కుడి ఎడమలకు తిరుగుతున్నారు, అతి భయంకరమైన వారి గదా ఘట్టనలకి నిప్పురవ్వలు రాలుతున్నాయి, ఆకాశం అదిరిపోతోంది..