పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పరమపావన (3-1053-త.)

3-1053-త.

మపావన! విశ్వభావన! బాంధవప్రకరావనా!
ధిశోషణ! సత్యభాషణ! త్కృపామయ భూషణా!
దురితతారణ! సృష్టికారణ! దుష్టలోక విదారణా!
ణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దన ఖేలనా!

టీకా:

పరమ = అత్యుత్తమమైన; పావన = పవిత్రత కలవాడా; విశ్వ = విశ్వమంతటను; భావన = తలచుకొనబడువాడా; బాంధవ = బంధువుల; ప్రకర = సమూహములకు; అవన = కాపాడువాడా; శరధి = సముద్రమును; శోషణ = ఆవిరిచేసినవాడా; సత్య = సత్యము; భాషణ = మాట్లాడువాడా; సత్ = మంచి; కృపా = దయతో; మయ = కూడుట అను; భూషణా = భూషణము కలవాడా; దురిత = పాపులను; తారణ = తరింప చేయువాడా; సృష్టి = సృష్టికి; కారణా = కారణము అయినవాడా; దుష్ట = దుష్టులగు; లోక = జనులను; విదారణ = సంహరించువాడా; ధరణి = భూమిని; పాలన = పాలించునాడా; ధర్మ = ధర్మబద్ధమైన; శీలన = శీలము కలవాడా; దైత్య = రాక్షసులను; మర్దన = శిక్షంచుట అను; ఖేలనా = క్రీడ కలవాడా.

భావము:

శ్రీరామచంద్రప్రభు! నీవు పరమపావనుడవు. విశ్వభావనుడవు. బంధుజనావనుడవు. సముద్రజలాలను శోషింపజేసిన వాడవు. సత్యభాషణుడవు, అపారదయాగుణ భూషణుడవు. దురితాలను గట్టెక్కించే వాడవు. జగత్ సృష్టికి కారణభూతుడవు. దుష్టులను చీల్చి చెండాడు వాడవు. మహారాజవు. ధర్మాన్ని పాలించేవాడవు. రాక్షసులను నిర్మూలించే వాడవు.

   ఇది శ్రీమత్తెలుగుభాగవత తృతీయ స్కంధాంత ప్రార్థన.