పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పనుపక (9-558-క.)

9-558-క.

నుపక చేయుదు రధికులు
నిచిన మధ్యములు పొందుఱతురు తండ్రుల్
నిచెప్పి కోరి పనిచిన
నిశము మాఱాడు పుత్రు ధములు దండ్రీ!

టీకా:

పనుపక = చెప్పకమునుపే; చేయుదురు = చేసెదరు; అధికులు = ఉత్తములు; పనిచినన్ = ఆజ్ఞాపించినాక; మధ్యములున్ = మధ్యములు; పొందుపఱతురున్ = సమకూర్చెదరు; తండ్రుల్ = తండ్రులు; పనిన్ = పనిని; చెప్పి = తెలిపి; కోరి = కావాలని; పనిచినన్ = ఆజ్ఞాపించినాక; అనిశము = ఎల్లప్పుడు; మాఱాడు = ఎదురుచెప్పెడి; పుత్రుల్ = కొడుకులు; అధములున్ = నీచులు; తండ్రీ = తండ్రీ .

భావము:

నాన్నగారు! ఉత్తములు తండ్రుల ఇంగితం తెలుసుకౌని చెప్పకుండానే పనులు చేసేస్తారు. మధ్యములు చెప్పిన పిమ్మట చేస్తారు. తండ్రులు చెప్పిన పనికి ఎప్పుడు ఏదో ఒకటి అడ్డు చెప్పి చెయ్యకుండా ఉండే కొడుకులు అధములు.

   యయాతి శాపం వల్ల తనకి వచ్చిన ముదిమిని కొంతకాలం పాటు తీసుకొని వారి యౌననాన్ని ఇమ్మని ముగ్గురు కొడుకులను వరుసగా అడిగాడు. తుర్వస, ద్రుహ్యులనే పెద్దవాళ్ళు ఇద్దరు అంగీకరించలేదు. చిన్నవాడైన పూరువు అంగీకారం తెలుపు సందర్భంలో తండ్రి ఆజ్ఞను ఎలా శిరసావహించాలో వివరించిన పద్యం ఇది. ఈయనే తరువాత కాలంలో పురుమహారాజుగా మిక్కిలి ప్రఖ్యాతి గాంచాడు