పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : పంకజముఖి (10.1-105-క)

10.1-105-క.

పంజముఖి నీ ళ్ళాడఁను
సంటపడ ఖలులమానసంబుల నెల్లన్
సంటము దోఁచె; మెల్లన
సంటములు లేమి తోఁచె త్పురుషులకున్.

టీకా:

పంకజముఖి = సౌందర్యవతి; నీళాడను = ప్రసవించుటకు; సంకటబడన్ = నెప్పులుపడుతుండగా; ఖలుల = దుష్టుల; మానసంబులు = మనసులు; ఎల్లన్ = సమస్తమును; సంకటము = కీడులు; తోచెన్ = కనబడెను; మెల్లనన్ = శాంతిగా; సంకటములు = బాధలు; లేమి = లేకపోవుటలు; తోచెన్ = కనబడెను; సత్పురుషుల్ = సజ్జనుల; కున్ = కు.

భావము:

పద్మం వంటి ముఖం గల దేవకి కృష్ణుని కనుటకు ప్ర,సవవేదనలు పడుతుంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి.అంటు విశ్వేశుడు భూమిపై అవతరించే సమయంలో విశ్వమంతా ఎలా స్పందిస్తోందో వర్ణిస్తున్నారు మన పోతనమాత్యులవారు.