పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : మందునకు (1-395-క.)

1-395-క.

మందునకు మందబుద్ధికి
మందాయువునకు నిరర్థమార్గునకును గో
వించరణారవింద మ
రంము గొనఁ దెఱపి లేదు రాత్రిందివముల్.

టీకా:

మందున = చురుకు లేనివాని; కున్ = కి; మంద = మందమైన; బుద్ధి = బుద్ది కలవాని; కిన్ = కి; మంద = తక్కవగా ఉన్న; ఆయువున = జీవితకాలము కలవాని; కున్ = కి; నిరర్థ = ప్రయోజనము లేని; మార్గున = జీవన మార్గము కలవాని; కును = కిని; గోవింద = కృష్ణుని స; చరణ = పాదములు అను; అరవింద = పద్మముల యొక్క; మరందమున్ = తేనె; కొనన్ = తీసుకొనుటకు / ఆస్వాదించుటకు; తెఱపి = సమయము; లేదు = లేదు; రాత్రిన్ = రాత్రులందును; దివముల్ = పగళ్ళందును / ఎప్పుడును.

భావము:

మందబుద్ధులు, సోమరిపోతులు, అల్పాయుష్కులు నైన మూర్ఖులు మాత్రమే పనికిమాలిన మార్గాలలో పడి కొట్టుకొంటూ ఉంటారు. అటువంటి వారికి హరిచరణ కమల సుధాధారలను చవిచూడటానికి రాత్రింబవళ్లు ఖాళీ సమయమే దొరకదు.

   పారీక్షిత్త భాగవతం వివరించమని శౌనకాదులు సూతుని అడుగుతు కలియుగపు మానవుల గురించి పలికిన పలుకులు. కలి ప్రభావం వల్ల మానవులు మందబుద్ధులు అల్పతరాయువులు అవుతారని తెలిసే వ్యాసభగవానుడు భాగవత రచనకి ఉపక్రమించాడు కదా.