పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : మమ్ముబెండ్లి (10.1-689-ఆ.)

10.1-689-ఆ.

మ్ముఁబెండ్లి చేయు మాప్రాణవల్లభు
ప్రాణమిచ్చి కావు క్తవరద!
నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు.

టీకా:

మమ్మున్ = మమ్ములను; పెండ్లిచేయుము = పెళ్ళిచేయుము, కూర్చుము; మా = మా యొక్క; ప్రాణవల్లభు = భర్త యొక్క; ప్రాణమున్ = ప్రాణమును; ఇచ్చి = ఇచ్చి; కావు = కాపాడుము; భక్తవరద = కృష్ణా {భక్తవరదుడు - భక్తుల కోరికలు తీర్చువాడు, విష్ణువు}; నీవు = నీవు; చేయు = చేసెడి; పెండ్లి = పెళ్ళి, శుభము; నిత్యంబు = శాశ్వతమైనది; భద్రంబు = మేలైనది; పిన్ననాటి = మా చిన్నప్పటి; పెండ్లి = పెళ్శి; పెళ్ళి = పెళ్ళి అని చెప్పదగినది; కాదు = కాదు.

భావము:

కాళింది మడుగులో కాలకూటం విషం కక్కే భీకర మైన కాళీయ సర్పరాజాన్ని కృష్ణుడు మర్ధిస్తున్నాడు. అతని భార్యలు మొర పెట్టుకుంటున్నారు.

      – భక్తులకు వరాలిచ్చే మహానుభావ! శ్రీకృష్ణ! మా ప్రాణప్రియు డైన కాళీయుడి ప్రాణాలు ప్రసాదించి, అతనితో మాకు కల్యాణం చేయించు. చిన్నప్పుడు జరిగిన మా పెళ్ళి కల్యాణం కాదు. ఇప్పుడు నీవు మాకు చేసే కల్యాణమే శాశ్వతంగా ఉండేది, క్షేమకర మైనది