పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : మకరమొకటి (8-114-క.)

8-114-క.

ర మొకటి రవిఁ జొచ్చెను;
రము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
రాలయమునఁ దిరిగెఁడు
రంబులు కూర్మరాజు ఱువున కరిగెన్.

టీకా:

మకరము = మకరరాశి {ద్వాదశరాశులు - 1మేషము 2వృషభము 3మిథునము 4కర్కాటకము 5సింహము 6కన్య 7తుల 8వృశ్చికము 9ధనుస్సు 10మకరము 11కుంభము 12మీనము}; ఒకటి = ఒకటి; రవిన్ = సూర్యుని, జాతక చక్రములో రవి స్థానమును; చొచ్చెన్ = చేరెను; మకరము = నవనిధులలోని మకరము {నవనిధులు - 1మహాపద్మము 2పద్మము 3శంఖము 4మకరము 5కచ్ఛపము 6ముకుందము 7కుందము 8నీలము 9వరము}; మఱియొకటి = ఇంకొకటి; ధనదు = కుబేరుని {ధనదుడు - ధనమునిచ్చువాడు, దాత, కుబేరుడు}; మాటున = రక్షణలో; డాగెన్ = దాగినది; మకరాలయమున్ = సముద్రునందు {మకరాలయము - మొసళ్ళకు నిలయము, సముద్రము}; తిరిగెడు = సంచరించెడి; మకరంబులు = మొసళ్ళు; కూర్మరాజు = ఆదికూర్మము; మరువున్ = చాటున; కున్ = కు; అరిగెన్ = వెళ్ళెను.

భావము:

ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.

  మకరం అంటే మొసలి. ఇలా మొసళ్ళు అన్ని బెదిరిపోడానికి కారణం భూలోకంలో ఒక మడుగులో ఉన్న గజేంద్రుని హరించసిద్దపడ్డ మకరం ఖండింపబడటం. విష్ణుమూర్తి సుదర్శనచక్రం అంటే ఉన్న విశ్వవ్యాప్త భీతిని స్పురింపజెసినట్టి కవి చమత్కారం యిది. (1) ఆకాశంలో ఉన్న మకరం అంటే ఆకాశంలో (1మేషము 2వృషభము 3మిథునము 4కర్కాటకము 5సింహము 6కన్య 7తుల 8వృశ్చికము 9ధనుస్సు 10మకరము 11కుంభము 12మీనము అనబడే) ద్వాదశ రాసులు ఉన్నాయి కదా వాటిలోని మకరం, (2) పాతాళంలో ఉన్న మకరం అంటే కుబేరుని వద్ద (1మహాపద్మము 2పద్మము 3శంఖము 4మకరము 5కచ్ఛపము 6ముకుందము 7కుందము 8నీలము 9వరము అనబడే) నవనిధులు ఉన్నాయి కదా వాటిలోని మకరం. (3) సముద్రంలోని మకరాలు అంటే మొసళ్ళకి అదే కదా నివాసం. ఆ మకరాలన్నీ. ఇంకా సముద్ర మథన సమయంలో ఆది కూర్మం సముద్రంలోనే కదా అవతరించింది.గజేంద్రుడంటే గజసాధకుడు. మకరం అంటే వదిలించుకోలేనంత గట్టిగా పట్టుకొనే ఇంద్రియ చాపల్యం. దాన్ని ఖండించటానికి తిరుగులేని మార్గం చక్రధరునిమీది భక్తి. అప్పుడు పాతాళం అంత అంతరాళ్ళలో ఉన్నా, ఆకాశ మంత ఎత్తు కెదిగిపోయినా, సముద్రమంత లోతుగా పాతుకుపోయినా చాపల్యాలు అణిగిపోతాయి.