పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : హరిచరణాంబుజ (5.1-5-క.)

5.1-5-క.

రిచరణాంబుజ మకరం
సావేశిత మనః ప్రధానుండగు స
త్పురుషుఁ డొకవేళ విఘ్నముఁ
బొసినఁ దన పూర్వ మార్గమును విడువఁ డిలన్

టీకా:

హరి = విష్ణుమూర్తి; చరణ = పాదములు యనెడి; అంబుజ = పద్మముల; మకరంద = మకరందపు; రస = రుచి; ఆవేశిత = ఆవేశించిన; మనః = మనసే; ప్రధానుండు = ముఖ్యముగా కలవాడు; అగు = అయిన; సత్ = మంచి; పురుషుడు = మానవుడు; ఒకవేళ = ఏ కారణముచేతనైన; విఘ్నమున్ = ఆటంకమును; పొరసినన్ = పొందినను; తన = తన యొక్క; పూర్వ = మొదటి; మార్గమును = మార్గమును; విడువడు = వదలడు; ఇలన్ = భూమిపైన.

భావము:

పరీక్షిన్మహారాజా! విను. శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మాలనే మకరందరస పానంలో లీనమై పరవశించే మనసు కలిగిన మంచిమనిషి, ఒకవేళ అడ్డులు ఆటంకాలు ఎదురైనా పూర్వమార్గాన్ని సుతారమూ వదలిపెట్టడు.విష్ణుభక్తి మార్గం రుచి తెలిసిన మనీషి, ఎన్ని అడ్డంకులు వచ్చినా మార్గాన్ని వదలడు, వదలలేడు. విఘ్నాలు కూడ ఆయన సంకంకల్పాలే కదా. సర్వవ్యాపకుడైన శ్రీహరి జన్మాంతరాలనైనా తన భక్తులని నిర్లక్ష్యం చేయడు. చెరువులోనికి నది నీటిని వదలటానికి, తూము తెరవటం వరకు మన పని, ఎంత నీరు ఎంతవేగంతో నింపాలి అన్నది నదీప్రవాహమే చూసుకుంటుంది.