తేనెసోనలు(ప-హ) : హంతవ్యుడు (7-189-క.)
7-189-క.
హంతవ్యుఁడు రక్షింపను
మంతవ్యుఁడు గాడు యముని మందిరమునకున్
గంతవ్యుఁడు వధమున కుప
రంతవ్యుం డనక చంపి రండీ పడుచున్.
టీకా:
హంతవ్యుడు = చంపదగినవాడు; రక్షింపను = కాపాడుటకు; మంతవ్యుడు = యోచింపదగినవాడు; కాడు = కాడు; యముని = యముడి యొక్క; మందిరమున్ = ఇంటి; కున్ = కి; గంతవ్యుడు = పోదగినవాడు; వధమున్ = చంపుట; కున్ = కు; ఉపరంతవ్యుడు = మానదగినవాడు; అనక = అనకుండగ; చంపి = సంహరించి; రండి = రండి; ఈ = ఈ; పడచున్ = పిల్లవానిని.
భావము:
ఈ పిల్లాడు చంపదగినవాడు కాని రక్షింప దగినవాడు కాదు. చిన్న కుర్రాడిని చంపడం ఎందుకని ఆలోచించంకండి. యమలోకానికి పంపదగినవాడు కనుక వెంటనే ప్రహ్లాదుడిని చంపేసి రండి.
అని హిరణ్యకశిపుడు తన రాక్షసభటులను ఆజ్ఞాపిస్తున్నాడు.