పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : హలకులిశ (7-277-మ.)

(7-277-మ.

కులిశ జలజ రేఖా
లితశ్రీకృష్ణపాదక్షితయై ని
ర్మగతి నొప్పెడు ధరణీ
నామణి నేఁ డభాగ్య క్షణ యయ్యెన్.

టీకా:

హల = నాగలి; కులిశ = వజ్రము; జలజ = పద్మ; రేఖ = రేఖలతో; లలిత = అందమైన; శ్రీకృష్ణ = శ్రీకృష్ణ భగవానుని; పాద = పాదములచే; లక్షిత = ముద్రింపబడినది; ఐ = అయ్యి; నిర్మల = నిర్మలమైన; గతిన్ = విధముగ; ఒప్పెడు = ఒప్పి ఉండే; ధరణీ = భూమి అను; లలనామణి = దేవి; నేడు = ఇవాళ; అభాగ్య = భాగ్యములేని; లక్షణ = లక్షణములుకలది; అయ్యెన్ = ఆయిపోయినది.

భావము:

శ్రీకృష్ణ స్వస్థాన గమన సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్టి మహా పురుషుడు ఉద్ధవుడు. శ్రీకృష్ణ వియోగ శోకాగ్ని తప్తు డౌతు వెళ్ళి విదురుని దర్శించి శ్రీకృష్ణ నిర్యాణం, దుఃఖంతో పూడకుపోతున్న కంఠంతో తెలుపుతున్నాడు – హలము, వజ్రము, పద్మము మున్నగు రేఖలతో అంద మైన నందనందనుని అడుగుల ముద్రలతో స్వచ్చంగా సలక్షణంగా ప్రకాశించే భూదేవి ఈరోజు దౌర్భగ్యలక్షణాలు కలది అయిపోయింది.