పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : బొమ్మ పెండిండ్లకు (10.2-180-సీ._

10.2-180-సీ.

బొమ్మ పెండిండ్లకుఁ బోనొల్ల నను బాల;
ణరంగమున కెట్లు రాఁదలంచె?
గవారిఁ గనినఁ దా ఱుఁగు జేరెడు నింతి;
గవారి గెల్వనే గిదిఁ జూచెఁ?
సిఁడియుయ్యెల లెక్క య మందు భీరువు;
గపతి స్కంధమే డిఁది నెక్కె?
ఖుల కోలాహల స్వనము లోర్వని కన్య;
టహభాంకృతుల కెబ్భంగి నోర్చె?

10.2-180.1-ఆ.

నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ
లసి తలఁగిపోవు లరుఁబోఁడి
యే విధమున నుండె నెలమి నాలీఢాది
మానములను రిపులమాన మడఁప?

టీకా:

బొమ్మ = పిల్లల బొమ్మలాటలోని; పెండిండ్లు = పెళ్ళిళ్ళు; కున్ = కు; పోన్ = వెళ్ళుటకు; ఒల్లను = ఓపికలేదు; అను = అనెడి; బాల = చిన్నది; రణ = యుద్ధ; రంగమున్ = క్షేత్రమున; కున్ = కు; ఎట్లు = ఏ విధముగ; రాన్ = రావాలని; తలంచె = అనుకొనెను; మగవారిని = మగవాళ్ళను; కనినన్ = చూసినచో; తాన్ = తాను; మఱుగు = చాటుననకు; చేరెడు = చేరునట్టి; ఇంతి = చిన్నది; పగవారి = శత్రువుల; గెల్వన్ = జయింపవలెనని; ఏ = ఏ; పగిదిని = విధముగా; చూచెన్ = అనుకొనెను; పసిడి = బంగారు; ఉయ్యెలలు = ఉయ్యాలలను; ఎక్కన్ = ఎక్కుటకు; భయమున్ = భీతిని; అందు = చెందెడి; భీరును = భయస్తురాలు; ఖగపతి = గరుత్మంతుని; స్కంధమున్ = మూపుమీదకి; ఏ = ఏ; కడిదిన్ = విధముగా; ఎక్కెన్ = ఎక్కెను; సఖుల = చెలికత్తెల; కోలాహల = కలకలల; స్వనమున్ = ధ్వనులను; ఓర్వని = తట్టుకోలేని; కన్య = చిన్నది; పటహ = యుద్ధవాద్యముల; భాంకృతులన్ = భాం అనెడి మోతల; కున్ = కి; ఏ = ఏ; భంగిన్ = విధముగా; ఓర్చె = తట్టుకొనెను;

 నీలకంఠములు = నెమళ్ళ {నీలకంఠము - నీలముగా నున్న మెడ కలది, నెమలి}; కున్ = కు; నృత్యంబున్ = నాట్యములను; కఱపుచున్ = నేర్పుతు; అలసి = బడలిక చెంది; తలగిపోవు = తొలగునట్టి; అలరుబోడి = చిన్నది {అలరుబోడి - పుష్పము వలె సుకుమారమైన దేహము కలామె, స్త్రీ}; ఏ = ఏ; విధమునన్ = విధముగా; ఉండెన్ = నిలబడగలిగెను; ఎలమిన్ = వికాసముతో; ఆలీఢ = ఆలీఢము {ఆలీఢము - కుడికాలు ముందరికి చాచి యుద్ధము చేయుటకైన నిలుకడ}; ఆది = మున్నగు; మానములను = పదవిన్యాసములందు {ఆలీఢాదులు - పంచమానములు, 1ఆలీఢము 2ప్రత్యాలీఢము 3సమపదము 4విశాఖము 5మండలము అనెడి ఐదు విలుకాని పద విన్యాసములు}; రిపుల = శత్రువుల; మానమున్ = గర్వమును, గౌరవమును; అడపన్ = అణచివేయుటకు.

భావము:

బొమ్మల పెళ్ళళ్ళకే వెళ్ళలేను అనే లతాంగి యుద్ధరంగానికి రావాలని అనుకుంటోంది? మగవారిని చూడగానే చాటుకు పోయే మగువ పగవారిని ఓడించాలని ఎలా భావిxచింది? బంగారు ఉయ్యాలలు ఎక్కడానికే బెదిరే భామ గరుత్మంతుని మూపు ఎలా ఎక్కింది? చెలికత్తెలు కోలాహల కూజితాలకే ఓర్చలేని పడతి యుద్ధభేరీల ధన్వులు ఎలా భరించింది? నెమళ్ళకు నాట్యాలు నేర్పి అలసిపోయే అబల బాణాలువేసే భంగిమలు ఎడం పాదం ముందుకు ఉంచి కుడి పాదం వంచి లాంటివి వేసి శత్రువుల గర్వం అణచటానికి ఎలా సిద్ధపడింది? ఎంత వింత.

   ఇది నరకాసురిని మీద యుద్ధానికి వెళ్ళిన సత్యభామని మన పోతన గారు వర్ణించిన తియ్యటి తీరు.