పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : భగవంతుండగు (1-65-క.)

1-65-క.

వంతుం డగు విష్ణుఁడు
ముల కెవ్వేళ రాక్షవ్యధ గలుగుం
నవ్వేళలఁ దడయక
యుయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.

టీకా:

భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; విష్ణుఁడు = హరి; జగములు = లోకములు; కు = కు; ఎవ్వేళ = ఏవేళ; రాక్షస = రాక్షసులవలన; వ్యధ = బాధ; కలుగున్ = కలుగుతుందో; తగన్ = తగినట్లుగ; ఆ = ఆ; వేళలన్ = సమయములలో; తడయక = ఆలస్యము చేయక; యుగయుగమునన్ = ప్రతియుగములోను; పుట్టి = ఉద్భవించి; కాచున్ = రక్షించును; ఉద్యత్ = యత్నమనే; లీలన్ = మాయతో.

భావము:

ప్రతి యుగంలో రాకాసుల చేష్ఠలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో, భగవంతుడైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు.

 సూతమహర్షి శౌనకాది మహర్షులకు భాగవతం చెప్పటానిక శ్రీకారంచుట్టుతు సంభవామి యుగే యుగే అన్న భగవద్గీత వాక్యార్థాన్ని ఇలా స్మరించాడు.