పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వసుధాఖండము (8-570-మ.)

8-570-మ.

సుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వెనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
సిబాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా
సురేంద్రుండు పదత్రయం బడుగ నీ ల్పంబు నీ నేర్చునే?

టీకా:

వసుధాఖండము = భూభాగమును; వేడితో = అడుగుటకాని; గజములన్ = ఏనుగులను; వాంఛించితో = కోరుటకాని; వాజులన్ = గుర్రములను; వెసన్ = మిక్కిలి; ఊహించితో = అనుకొనుటకాని; కోరితో = కావాలనుటకాని; యువతులన్ = జవరాండ్రను; వీక్షించి = చూసి; కాంక్షించితో = కోరుటకాని; పసి = బాగాచిన్న; బాలుండవు = పిల్లవాడవు; నేరవు = తెలియనివాడవు; అడుగ = అడుగుట; నీ = నీయొక్క; భాగ్యంబుల్ = అదృష్టములు; ఈపాటి = ఈమాత్రమే; కాక = అయినప్పటికిని; అసురేంద్రుండు = రాక్షసచక్రవర్తి; పదత్రయంబు = మూడడుగులే; అడుగన్ = అడిగినని; ఈ = ఇంత; అల్పంబున్ = కొంచమును; ఈన్ = ఇచ్చుట; నేర్చునే = చేయకలడా.

భావము:

భూభాగం కోరుకోవాలి లేదా ఏనుగులు కోరుకోవాలి లేదా గుర్రాలను కోరాలి లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే జవరాండ్రను కోరుకోవాలి. కాని చిన్నపిల్లాడివి కదా అడగటం తెలియదు. నీ సిరి / సామర్థ్యం ఇంత అల్పమైందే. కనుకే మూడడుగులు మాత్రమే అడిగావు. ఐనా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను.

   అని అంటున్నాడు బలిచక్రవర్తి మూడడుగుల మేర దానం అడిగిన వామనునితో.