పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : వారిగోరుచున్న

1-458-వ.

ఇట్లు వాటంబయిన వేఁటతమకంబున మృగంబుల వెంబడిం బడి యెగచుచుం జరించుటంజేసి బుభుక్షా పిపాసల వలన మిగుల బరిశ్రాంతుండయి ధరణీకాంతుండు చల్లని నీటి కొలంకుం గానక కలంగెడు చిత్తంబుతోఁ జని, యొక్క తపోవనంబు గని యందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వాటంబు = కౌతుక సహితము – వాడిది; అయిన = అయినట్టి; వేఁట = వేటమీది; తమకంబున = పరవశత్వముతో; మృగంబులన్ = జంతువులను; వెంబడిన్ = వెనకాతల; పడి = పడి; ఎగచుచున్ = తరుముతూ; చరించుటన్ = తిరుగుట; చేసి = వలన; బుభుక్షా = ఆకలియును; పిపాసల = దాహముల; వలనన్ = వలన; మిగులన్ = మిక్కిలి; పరిశ్రాంతుండు = అలసినవాడు; అయి = అయ్యి; ధరణీకాంతుండు = రాజు, పరీక్షిత్తు {ధరణీకాంతుండు - భూమికిభర్త - రాజు, పరీక్షిత్తు}; చల్లని = చల్లని; నీటి = నీటి; కొలంకున్ = కొలనును - చెరువును; కానక = కనుగొన లేక; కలంగెడు = కలత పడిన; చిత్తంబు = మనసు; తోన్ = తో; చని = వెళ్ళి; ఒక్క = ఒక; తపస్ = తపస్సు చేసుకొను; వనంబున్ = వనమును; కని = చూసి - కనుగొని; అందున్ = అందులో.

భావము:

దాహంతో అల్లాడిపోతూ పరీక్షిత్తు నీ ళ్ళడిగితే ధ్యానంలో ఉన్న శమీకమహర్షి స్పందించ లేదు. అది గమనించక ఉక్రోషంతో పరీక్షిన్మహారాజు మరోలా అనుకుం టున్నాడు – దాహంతో నోరెండి పోయి వాకిట్లోకి వచ్చి మంచినీళ్ళు అడిగిన అతిథికి, చల్లని మంచినీళ్ళు ఇవ్వటం ఎటువంటి వారికి అయినా సరే కాదనరాని కనీస కర్తవ్యమే. కాని ఇతడు మంచినీళ్ళు ఇవ్వటంలేదు, దాహం తీర్చటం లేదు.