పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : ఱోలనుకట్టుబడియు (10.1-380-క.)

10.1-380-క.

ఱోను కట్టుపడియు న
బ్బాలుఁడు విలసిల్లె భక్త రతంత్రుండై
యాలాన సన్నిబద్ద వి
శామదేభేంద్రకలభ మరుచి నధిపా!

టీకా:

ఱోలను = రోటికి; కట్టుపడియున్ = కట్టివేయబడి; ఆ = ఆ; బాలుడు = బాలకృష్ణుడు; విలసిల్లెన్ = ఒప్పెను; భక్త = భక్తులకు; పరతంత్రుండు = లోబడునట్టివాడు; ఐ = అయ్యి; ఆలాన = ఏనుగుకట్టుకొయ్యకు; సత్ = మిక్కిలి; నిబద్ధ = కట్టివేయబడినట్టి; విశాల = అధికమైన; మద = మదించిన; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠము; కలభ = గున్నతో; సమ = సమానమైన; రుచిన్ = ప్రకాశముతో; అధిపా = రాజా.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! ఆ గోపాలబాలకుడు సదా భక్తుల వశంలో ఉండేవాడు కదా. అలా తల్లి యశోదచే రోలుకి కట్టబడినా బిక్కమొహం యేం వెయ్యలేదు. కట్టుకొయ్యకు కట్టబడిన మదించిన గొప్ప ఏనుగు గున్నలా ఎంతో హుందాగా వెలిగిపోతున్నాడు.