పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : రామలతోడను (10.1-1089-క.)

10.1-1089-క.

రాలతోడను రాసము
రామానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో
రాములమీఁద వియచ్చర
రాలు మూర్చిల్లిపడిరి రామవినోదా!

టీకా:

రామలు = పడతుల {రామ - రమింపజేయునామె, స్త్రీ}; తోడను = తోటి; రాసమున్ = రాసక్రీడను; రామానుజుండు = కృష్ణుడు {రామానుజుడు - బలరాముని తోబుట్టువు, కృష్ణుడు}; ఆడన్ = ఆడుతుండగ; చూచి = చూసి; రాగిల్లి = రక్తినిపొంది; మనోరాముల = భర్తల; మీదన్ = పైన; వియచ్చర = దేవతా; రామలు = స్త్రీలు; మూర్చిల్లి = ఆనందముతో చొక్కి; పడిరి = వాలిపోయిరి; రామవినోదా = పరీక్షిన్మహారాజా {రామవినోదుడు - రామ (పరబ్రహ్మము, ప్రమాణము శ్లో. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని, ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మాభియతే.) అందు వినోదించువాడు, పరీక్షిత్తు}.

భావము:

పరీక్షిన్మహారాజ! బ్రహ్మము నందు క్రీడించువాడ! గోవిందుడు గోపవనితలతో రాసలీల సలుపు తుండగా చూసి రంజిల్లిన వారై ఖేచరభామలు పారవశ్యంతో తూలి సోలి తమతమ ప్రాణవల్లభుల మీద వాలిపోయారు.