పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : రాపూర్ణచంద్రిక (10.1-604-సీ.)

10.1-604-సీ.

రాపూర్ణచంద్రిక! రాగౌతమీగంగ! ;
మ్ము భగీరథరాజతనయ!
రాసుధాజలరాశి! రామేఘబాలిక! ;
మ్ము చింతామణి! మ్ము సురభి!
రామనోహారిణి! రాసర్వమంగళ! ;
రాభారతీదేవి! రాధరిత్రి!
రాశ్రీమహాలక్ష్మి! రామందమారుతి! ;
మ్ము మందాకిని! రాశుభాంగి!

10.1-604.1-ఆ.

నుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు
డవిలోన దూరమందు మేయ
నగభీరభాషఁ డునొప్పఁ జీరు నా
భీరజనులు పొగడఁ బెంపు నెగడ.

టీకా:

రా = రమ్ము; పూర్ణచంద్రిక = పూర్ణచంద్రిక; రా = రమ్ము; గౌతమీగంగ = గౌతమీగంగ; రమ్ము = రమ్ము; భగీరథరాజతనయ = భగీరథరాజతనయ; రా = రమ్ము; సుధాజలరాశి = సుధాజలరాశి; రా = రమ్ము; మేఘమాలిక = మేఘమాలిక; రమ్ము = రమ్ము; చింతామణి = చింతామణి; రమ్ము = రమ్ము; సురభి = సురభి; రా = రమ్ము; మనోహారిణి = మనోహారిణి; రా = రమ్ము; సర్వమంగళ = సర్వమంగళ; రా = రమ్ము; భారతీదేవి = భారతీదేవి; రా = రమ్ము; ధరిత్రి = ధరిత్రి; రా = రమ్ము; శ్రీమహాలక్ష్మి = శ్రీమహాలక్ష్మి; రా = రమ్ము; మందమారుతి = మందమారుతి; రమ్ము = రమ్ము; మందాకిని = మందాకిని; రా = రమ్ము; శుభాంగి = శుభాంగి.

అనుచున్ = అని; మఱియున = ఇంకను; కలుగు = ఉన్న; ఆఖ్యలు = పేర్లు; కల = కలగిన; గోవులు = పశువులు; అడవి = అడవి; లోనన్ = అందు; దూరము = దూరము; అందున్ = అందు; మేయన్ = గడ్డితినుచుండగా; ఘన = గొప్ప; గభీర = గంభీరమైన; భాషన్ = గొంతుతో; కడున్ = మిక్కిలి; ఒప్పన్ = చక్కగా; చీరున్ = పిలిచును; ఆభీర = యాదవ; జనులు = ప్రజలు; పొగడన్ = కీర్తించుచుండగా; పెంపున్ = గొప్పదనముతో; నెగడన్ = అతిశయించగా.

భావము:

గోవులు (జ్ఞానులు నామ రూప జ్ఞానాలు) మేస్తూ అడవిలో (సంసారాటవిలో) దూరదూరాల్లోకి దారితప్పి వెళ్ళి పోయాయి. శ్రీకృష్ణుడు గొల్లపిల్లలను (పసిమనసు లంత స్వచ్చమైన సిద్ధులను) చల్దులు తింటో (మననం చేస్తూ) ఉండ మని చెప్పి గోపాల బాలుడు బయలుదేరాడు అదిగో శ్రీకృష్ణ తత్వ ఆవిష్కరణ వెల్లడిస్తూ బమ్మెర వారు బ్రహ్మాండంగా అలతి పొలతి పదాలతో అలరిస్తున్నాడు – 

       ఇలా రావే ఓ పూర్ణచంద్రికా! రామ్మా గౌతమీగంగ! రావే భాగీరథీతనయా! ఇటు రా సుధాజలరాశి! రావమ్మ ఓ మేఘబాలిక! ఇలా రామ్మా చింతామణి! రామ్మా ఓ సురభి! రావే మనోహారిణీ! రమ్ము సర్వమంగళ! రా భారతీదేవీ! ఇటు రా ధరిత్రీ! రావమ్మా శ్రీమహాలక్ష్మీ! రావే మందమారుతి! రమ్ము మందాకిని! ఇలా రా శుభాంగీ! అంటు తన మేఘగర్జన లాంటి కంఠస్వరంతో అడవిలో దూర ప్రాంతాలకు పోయిన గోవులను వాటి పేరు పెట్టి పేరుపేరునా పిలుస్తున్నాడు. బహుచక్కటి ఆ పలుకుల గాంభీర్యానికి, మాధుర్యానికి ఆనందించి గోకులంలోని ఆభీరజనులు ఎంతో మెచ్చుకుంటున్నారు.