పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : రామున్ (2-160-క.)

2-160-క.

రామున్మేచకజలద
శ్యామున్సుగుణాభిరాము ద్వైభవసు
త్రామున్దుష్టనిశాటవి
రాముంబొమ్మనియెఁ బంక్తిథుఁ డడవులకున్.

టీకా:

రామున్ = రాముని; మేచక = నల్లని; జలద = మేఘము వంటి; శ్యామున్ = చాయ కలవానిని; సుగుణ = సుగుణములతో; అభిరామున్ = అందమైన వానిని; సత్ = మంచి, గొప్ప; వైభవ = వైభవముతో; సుత్రామున్ = దేవేంద్రుని వంటి వానిని {సుత్రాముడు – లోకములను లెస్సగా రక్షించువాడు, ఇంద్రుడు}; దుష్ట = చెడ్డ; నిశాటన్ = రాక్షసులను; విరామున్ = సంహరించిన వానిని; పొమ్ము = వెళ్ళుము; అనియెన్ = అనెను; పంక్తిరథుఁడు = దశరథుడు {పంక్తి - పది, దశ}; అడవులన్ = అడవుల; కున్ = కు;

భావము:

నల్లని మేఘఛాయతో మెరిసిపోతు ఉండే వాడు, సర్వసుగుణాలతో ఒప్పి ఉండే వాడు, ఐశ్వర్యంతో ఇంద్రునికి సాటివచ్చే వాడు, దుష్టులైన రాక్షసులను చెండాడెడి వాడు అయిన శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పొమ్మన్నాడు.