పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : రాజట (1-212-ఉ.)

1-212-ఉ.

రాజఁట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవో
ద్వేకమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం
యోకుఁడైన చక్రియఁట, యుగ్రగదాధరుఁడైన భీముఁడ
య్యాజికిఁదోడు వచ్చునఁట, యాపద గల్గు టిదేమి చోద్యమో.

టీకా:

రాజు = రాజు; అఁట = అట; ధర్మజుండు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; సురరాజ = ఇంద్రుని; సుతుండు = పుత్రుడు; అఁట = అట; అర్జునుడు { ధన్వి - ధనస్సు ధరించు వాడు, అర్జునుడు}; శాత్రవ = శత్రువులకు; ఉద్వేజకము = ఉద్వేగము; ఐన = అయినట్టి; గాండివము = గాండివము; అతని విల్లు = ధనస్సు; అఁట = అట; సారథి = రథం నడిపించు వాడు; సర్వ = సమస్త; భద్ర = శుభములను; సంయోజకుఁడు = కలిగించువాడు; ఐన = అయిన; చక్రి = చక్రధారి / కృష్ణుడు {చక్రి - చక్రము ధరించువాడు, కృష్ణుడు}; అఁట = అట; ఉగ్ర = భయంకరమైన; గదా = గదను; ధరుఁడు = ధరించువాడు; ఐన = అయి నట్టి; భీముఁడు = భీముడు; ఆ = ఆ; యాజి = యజ్ఞము చేసినవాని / ధర్మరాజు; కిఁన్ = కి; తోడు = తోడుగా; వచ్చున్ = వచ్చును; అఁట = అట; ఆపద = విపత్తు; కల్గుట = కలుగుట; ఇది = ఇది; ఏమి = ఏమి; చోద్యమో = చిత్రమో.

భావము:

ధర్మజు అంతటివాడు రాజు; మహావీరుడైనట్టి అర్జునుడు యోద్ధ; శత్రుభయంకరమైనట్టి గాండీవం అతని ధనుస్సు; సర్వ సౌభాగ్య సంధాత శ్రీకృష్ణుడు రథసారథి; చండ ప్రచండమైన గదాదండం ధరించే భీముడు కొండంత అండ; అయినా ఇంతటి మహా మహిమాన్వితమైన సహాయసంపత్తులు ఉన్నా ఈ పాండవులు అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు మొదలైన ఆపదలు ఎన్నో పొందారు; ఎంత ఆశ్చర్యం!