పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : లాలనమున (10.1-366-క.)

10.1-366-క.

లానమున బహుదోషము
లోలింబ్రాపించుఁ దాడనోపాయములన్
జాగుణంబులు గలుగును
బాలురకును దాడనంబ థ్యం బరయన్.

టీకా:

లాలనమునన్ = గారాబముచేత; బహు = అనేకమైన; దోషములు = లోపములు; ఓలిన్ = క్రమముగా; ప్రాపించున్ = కలుగును; తాడనోపాయములన్ = దండోపాయములచేత; చాలన్ = మిక్కిలిగ; గుణంబులున్ = సుగుణములు; కలుగును = లభించును; బాలురు = మగపిల్లల; కును = కు; తాడనంబ = కొట్టిదండించుటయే; పథ్యంబు = తగినపని, మందు; అరయన్ = తరచిచూసినచో.

భావము:

గారాబం ఎక్కువ చేస్తే చివరికి పిల్లలు బాగ చెడిపోతారు. అప్పుడప్పుడు కొట్టి దండించటం అనే ఉపాయం ప్రయోగిస్తుంటే చాల మంచి గుణాలు అలవడతాయి. పిల్లల దుడుకుతనానికి దండోపాయమే మంచి మందు.

 బాల కృష్ణుని శైశవ క్రీడా లీలలోని అల్లరి పనులు చూసి యశోద దెబ్బ పడితేగాని బుద్ధిగా ఉండడని భావిస్తూ ఇలా ప్రసిద్ధమైన నీతి సూత్రాన్ని తలచింది; తరిమి పట్టుకొని కొట్టడానికి చేతులు రాక “వీరెవ్వరు శ్రీకృష్ములు గారా అంటు” కట్టేసింది; “ఱోలను కట్టుబడియు న బ్బాలుడు ” మద్ధిచెట్ల జతను కూల్చాడు.