పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : హరియుం (3-226-క.)

3-226-క.

రియుం దన మాయాగతిఁ
రికించియుఁ గానడయ్యె రిమితి లేమిన్
ఱిమాయా వినిమోహిత
రితముఁ గనుఁగొందు రెట్లు తురాస్యాదుల్.

టీకా:

హరియున్ = హరి కూడ; తన = తన; మాయన్ = మాయ; గతిన్ = విధామును; పరింకించియున్ = విచారించినను; కానడు = తెలిసికొనలేడు; అయ్యెన్ = ఆయెను; పరిమితి = అవధి; లేమిన్ = లేకపోవుటచేత; మఱి = మరియును; మాయా = మాయ యొక్క; వినిమోహిత = మిక్కిలి మోహింపజేయు; చరితమున్ = వర్తనమును; కనుగొందురు = తెలిసికొనగలరు; ఎట్లు = ఏనిధముగా; చతురాస్య = బ్రహ్మదేవుడు {చతురాస్యుడు - నాలుగు (చతుర) ముఖము (అస్యము)లవాడు, బ్రహ్మదేవుడు}; ఆదుల్ = మొదలగువారు.

భావము:

విష్ణుకథాశ్రవణ కుతూహలు డైన విదురునకు మైత్రేయుడు శ్రీమన్నారాయణ చరిత్ర మహత్వం వివరిస్తున్నాడు – విష్ణుమాయకు పరిమితి యన్నది లేదు. బ్రహ్మాదుల కైనా మహామోహిని యైన ఆ మాయ ప్రభావం అంతు చిక్కటం అసాధ్యమే. ఆఖరికి శ్రీహరికూడ తన అనంతమైన మాయావధిని అవగాహన చేసుకోలేడు.