పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(ప-హ) : భూషణములు (1-46-క.)

1-46-క.

భూణములు వాణికి నఘ
పేణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోణములు కల్యాణ వి
శేణములు హరి గుణోపచితభాషణముల్.

టీకా:

భూషణములు = అలంకారములు; వాణి = సరస్వతి / వాక్కు; కిన్ = కి; అఘ = పాపములను; శోషణములు = ఇంకునట్లు చేయునవి; మృత్యు = మృత్యువు యొక్క; చిత్త = మనసునకు; భీషణములు = భయం కలిగించేవి; హృత్ = హృదయమునకు; తోషణములు = తుష్టి కలిగించేవి; కల్యాణవిశేషణములు = శుభకరమైన; విశేషణములు = విశిష్టతలను ఇచ్చునవి; హరి = హరియొక్క; గుణ = గుణములతో; ఉపచిత = కూడిన; భాషణముల్ = పలుకులు.

భావము:

శ్రీమహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారాలు. మృత్య దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల పాపాలను పరిహరించేవి. నిత్యకల్యాణములను సమకూర్చేవి.

శౌనకాది మహర్షులు పుణ్యమూలుని శ్రీమన్నారాయణుని కథలతో కూడిన భాగవతాన్ని చెప్పమని సూత మహర్షిని అడుగుతు, విష్ణుకథల మహత్వాన్ని ఇలా స్మరిస్తున్నారు.