పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఉన్నారము (1-251-క.)

1-251-క.

న్నారము సౌఖ్యంబున
విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్
న్నారము ధనికులమై
న్నారము తావకాంఘ్రిమలములు హరీ!

టీకా:

ఉన్నారము = ఉన్నాము; సౌఖ్యంబునన్ = సుఖంగ; విన్నారము = విన్నాము; నీ = నీ యొక్క; ప్రతాప = శౌర్యము; విక్రమ = పరాక్రమముల యొక్క; కథలన్ = కథలు; మన్నారము = మంటిమి / బ్రతికుతున్నాము; ధనికులము = ధనవంతులము; ఐ = అయ్యి; కన్నారము = కంటిమి / చూచితిమి; తావక = నీయొక్క; అంఘ్రి = పాద; కమలములు = పద్మములు; హరీ = కృష్ణా.

భావము:

కృష్ణయ్యా! నీ దయవల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. నీ శౌర్యప్రతాపాల గురించిన విశేషాలు వింటున్నాం, సంతోషిస్తున్నాం. మాకు ఇన్నాళ్ళకి మళ్ళా నీ పాదపద్మాల దర్శనం అయింది. భాగ్యవంతులమై విలసిల్లుతున్నాం.