పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : త్రిజగన్మోహన నీలకాంతి (1-219-మ)

1-219-మ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"త్రిగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రసంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
వియుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

టీకా:

త్రి = మూడు; జగత్ = లోకములను; మోహన = మోహింప చేయగల; నీల = నీలమైన; కాంతిన్ = కాంతితో; తనువు = శరీరము; ఉద్దీపింపన్ = బాగా ప్రకాశిస్తుండగ; ప్రాభాత = ఉదయ కాలపు; నీరజ = పద్మములకు; బంధు = బంధువు / సూర్యుని; ప్రభము = కాంతి కలది; ఐన = అయిన; చేలము = వస్త్రము; పయిన్ = పైన; రంజిల్లన్ = ఎర్రగా ప్రకాశిస్తుండగ; నీల = నల్లని; అలక = ముంగురుల యొక్క; వ్రజ = సమూహముతో; సంయుక్త = కూడిన; ముఖ = మఖము అనే; అరవిందము = పద్మము; అతి = మిక్కిలి; సేవ్యంబు = సేవింపదగినది; ఐ = అయ్యి; విజృంభింపన్ = చెలరేగుతూ; మా = మా యొక్క; విజయున్ = అర్జునుని; చేరెడు = చేరి యుండు; వన్నెలాఁడు = విలాసవంతుడు; మదిన్ = మనస్సును; ఆవేశించున్ = ప్రవేశించును గాక; ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడూ.

భావము:

“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి. కురుపితామహుడు భీష్మాచార్యులవారు అంపశయ్యమీద ఉన్నారు. శరీరత్యాగం చేయతగ్గ సమయం ఆసన్నమైంది. సమయానికి ధర్మరాజాదులతో శ్రీకృష్ణులవారు విచ్చేసి ఉన్నారు. ధర్మరాజుకి నీతులు బోధించి. భగవానుని స్తుతించారు. పరమాద్భుతమైన ఆ భీష్మస్తుతిలోనిది ఈ పద్యం.