పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తీపుగల (10.1-458-క.)

10.1-458-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తీపుగల కజ్జ మన్యుఁడు
కోపింపఁగ నొడిసి పుచ్చుకొని త్రోపాడం
బైడి యది గొని యొక్కఁడు
క్రేపులలో నిట్టునట్టుఁ గికురించు నృపా!

టీకా:

తీపు = తియ్యదనము; కల = ఉన్న; కజ్జమున్ = భక్ష్యమును, తీపిపిండివంట {కజ్జికాయలు – తీపితినుబండారము (కొబ్బరి కోరు బెల్లం పాకంలో పట్టించినది లస్కోరా / లౌజు అంటారు. మైదా పిండి పూరీలా గుండ్రంగా వత్తి ముందు చేసుకున్న లస్కోరా మధ్యలో పెట్టి సగానికి మడుస్తారు. రెండు పొరలు కలవటానికి అందంగా నొక్కులు నొక్కుతారు. అప్పుడు కాగుతున్న నూనెలో వేయిస్తారు. కొద్దిగా పొంగుతాయి. వాటిని కజ్జికాయలు అంటారు)}; అన్యుడు = ఇంకొకడు; కోపింపన్ = కోపపడునట్లుగా; ఒడిసి = లాగి; పుచ్చుకొని = తీసుకొని; త్రోపాడన్ = తోయగా; పైపడి = మీదపడి; అది = దానిని; కొని = తీసుకొని; ఒక్కడు = ఒకానొకడు; క్రేపుల = ఆవుదూడల; లోన్ = మధ్యలో; ఇట్టునట్టు = ఇటునటు; కికురించున్ = తప్పించుకొంటుతిరుగును; నృపా = రాజా.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! తియ్యటి పిండివంట ఒకడి చేతిలోంచి మరొకడు లాక్కుని పారిపోతున్నాడు. మొదటి వాడు ఉడుక్కున్నాడు. ఇంతలో ఇంకొకడు దానిని లాక్కుని పోయి, దూడల మధ్య అటు యిటు పరిగెడుతు ఏడిపించసాగాడు.