పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తరుణి యొకతె (10.1-326-ఆ.)

  •  
  •  
  •  

10.1-326-ఆ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణి యొకతె పెరుగుఁ ద్రచ్చుచోఁ దుది వంగి
వెన్నదీయ నొదిఁగి వెనుకఁ గదిసి
గువ! నీ సుతుండు గపోఁడుములు చేయ
సాఁగినాఁడు తగదె? క్కఁజేయ.

టీకా:

తరుణి = పడతి {తరుణి - తరుణ వయసు స్త్రీ}; ఒకతె = ఒకామె; పెరుగున్ = పెరుగును; తరచుచున్ = చిలుకుతూ; తుదిన్ = ఆఖరున; వంగి = వంగొని; వెన్నన్ = వెన్ను; తీయన్ = తీయుచుండగా; ఒదిగి = పొంచియుండి; వెనుకన్ = వెనుకవైపు; కదిసి = చేరి; మగువ = ఇంతి; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; మగపోడుములు = పోకిరీ వేషములు; చేయసాగినాడు = చేయుట మొదలెట్టెను; తగదె = ఉచితము కాదు, అవును; చక్కజేయన్ = సరిదిద్దుట.

భావము:

ఓ యమ్మా! ఒక యువతి పెరుగు చిలుకుతోంది. చివరకి వెన్న తీయడానికి వంగింది. నీ కొడుకు వెనక చేరి కూడని పనులు చేయసాగాడు. కొంచం బుద్ధి చెప్పరాదా? స్త్రీ బాలాంధజడోపమా అంటారు కదా అలా ఉండి, పెరుగు అనే జ్ఞానం పేరుకున్న వేదాలు చిలికిచిలికి, వెన్న అనే సారం తీయడానికి ప్రయత్నిస్తే సరిపోదు అని. ఏకాంతిక భక్తి లేనిచో వ్యర్థమని పరమాత్మ వెనుతగిలి మగపోడుమ లనే సరైన పురుషయత్నం చూపుతున్నాడట.