పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తరిగాండ్రలోన (8-205-క)

  •  
  •  
  •  

8-205-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిగాండ్రలోన నొకఁడట
రిగడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్;
రిగవ్వంబును దా నఁట
రిహరి! హరిచిత్రలీల రియే యెఱుఁగున్.

టీకా:

తరిగాండ్ర = చిలికెడివారి; లోనన్ = లోపల; ఒకడు = ఒకడు; అటన్ = అక్కడ; తరిగడవ = మజ్జిగకుండైనసముద్రము; కున్ = అందలి; కుదురున్ = కుదురు; నాక = సర్పపు; త్రాడు = తాడు; అటన్ = అక్కడ; చేరుల్ = చేరినవారు; తరి = చిలికెడి; కవ్వంబున్ = కవ్వము; తాన్ = తనే; అటన్ = అట; హరిహరి = ఆహా; హరి = విష్ణుని; చిత్ర = విచిత్రమైన; లీలన్ = లీలలను; హరియే = విష్ణువునకే; యెఱుగున్ = తెలియును.

భావము:

అలా సముద్రమథనం చేస్తున్న వారిలో ఒకడుగా ఉన్నాడు. సముద్ర మనే కుండ కుదురు తానే అయ్యాడు. చిలికే కవ్వం ఆ కవ్వానికి కట్టిన త్రాడు తానే అయ్యి, చేరిన వాళ్ళందరు తానే అయ్యాడు. ఆహా! ఏమి విచిత్రమైన విష్ణులీలలు వాటిని విష్ణువే తెలుసుకో గలడు. ఇతరులకు దుస్సాధ్యం.