పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తరణంబులు (11-15-క.)

  •  
  •  
  •  

11-15-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణంబులు భవజలధికి
ణంబులు దురితలతల కాగమముల కా
ణంబు లార్తజనులకు
ణంబులు, నీదు దివ్యరణంబు లిలన్‌.

టీకా:

తరణంబులు = దాటించెడి తెప్పలు; భవ = సంసార; జలధి = సముద్రమున; కిన్ = కు; హరణంబులు = హరించెడివి; దురిత = పాపాలు అనెడి; లతలు = తీవెల; కిన్ = కు; ఆగమములు = వేదాల; కిన్ = కు; ఆభరణంబులు = అలంకారములు; ఆర్త = ఆర్తులైన; జనులు = వారి; కున్ = కు; శరణంబులు = రక్షించునవి; నీదు = నీ యొక్క; దివ్య = దివ్యమైన; చరణంబు = పాదములు; లీలన్ = లీలవలె.

భావము:

ఓ శ్రీకృష్ణా! భూలోకంలో నీ దివ్యమైన శ్రీచరణాలు సంసారసాగరాన్ని దాటించే తెప్పల వంటివి. పాపాలనే పాశాలను హరించునవి. ఆగమాలకు ఆభరణాలైనవి. ఆర్తు లైన వారికి శరణు ఒసంగెడివి.
శ్రీకృష్ణులవారు యదవులను ఇక అణచవలసిన సమయం వచ్చింది అనే భావనలో ఉన్నారు. విశ్వామిత్రుడు, అసితుడు, దూర్వాసుడు మున్నగు మునులు అనేకులు కృష్ణదర్శనానికి వచ్చి వారిని స్తుతిస్తున్న సందర్భంలోని మధురమైన పద్యం ఇది.