పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తనువు మనువు ( 9-121-ఆ.)

  •  
  •  
  •  

9-121-ఆ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నువు మనువు విడిచి, నయులఁ జుట్టాల
నాలి విడిచి, సంపదాలి విడిచి,
న్నకాని యన్య మెన్నఁడు నెఱుఁగని
వారి విడువ నెట్టివారి నైన.

టీకా:

తనువున్ = దేహమును; మనువున్ = జీవితాన్ని; విడిచి = వదలి; తనయులన్ = పిల్లలను; చుట్టాలన్ = బంధువులను; ఆలిన్ = భార్యను; విడిచి = వదలివేసి; సంపద = సంపదలు; అలి = అన్నిటిని; విడిచి = వదిలేసి; నన్న = నన్నుమాత్రము; తప్పించి = తప్పించి; అన్యము = ఇతరము; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగని = తెలియని; వారిన్ = వారిని; విడువన్ = వదలిపెట్టను; ఎట్టి = ఎలాంటి; వారిన్ = వారు; ఐనన్ = అయినప్పటికిని.

భావము:

తమ దేహాన్ని, జీవితాన్ని, భార్యాబిడ్డలను, బాంధువులను, సంపదలను సర్వం వదలి నన్నే నమ్ముకున్న వారిని, నన్ను తప్పించి ఇతర మెరుగని వారిని, ఎలాంటివారైనా సరే నేను ఎన్నడు వదిలిపెట్టను.
భాగవత విధానంలో భక్తి ప్రపత్తుల లక్షణాలలో ముఖ్యమైన దానిని, ఇక్కడ పరబ్రహ్మ స్వరూపుని నోట మన కవిబ్రహ్మ ఎంత మధురంగా పలికిస్తున్నాడు. పరమ భాగవతోత్తముడు అంబరీష చక్రవర్తి మీదకు కృత్యను దూర్వాసుడు పట్టరాని కోపంతో ప్రయోగించాడు. విష్ణుచక్రం వెంటాడసాగింది. ఆ సుదర్శనం బారినుండి తప్పించుకోడానికి ముల్లోకాలు తిరిగాడు. బ్రహ్మ దేవుడు, పరమ శివుడు లను కూడా అర్థించాడు. ప్రయోజనం లేకపోయింది. చివరకు విష్ణుమూర్తిని శరణు వేడాడు. తన భక్తులంటే ఏమిటో, వారి యందు తనకు గల ప్రేమబంధం ఎంత గట్టిదో విష్ణుమూర్తి ఆ దూర్వాసునికి చెప్పే ఘట్టమిది. చిట్టచివరికి ఆ పరమ భాగవతుడు అంబరీషుని శరణు వేడితే కాని అంతటి దూర్వాసునికి కూడ తీరలేదు.