పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తండ్రుల కెల్ల (1-253-ఉ.)

  •  
  •  
  •  

1-253-ఉ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తండ్రుల కెల్లఁ దండ్రియగు ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా
తండ్రివిఁ దల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండ; వే
తండ్రులు నీ క్రియం బ్రజల న్యులఁ జేసిరి, వేల్పు లైన నో
తండ్రిభవన్ముఖాంబుజము న్యతఁ గానరు మా విధంబునన్.

టీకా:

తండ్రుల = తండ్రుల; కున్ = కు; ఎల్లన్ = అందరికి; తండ్రి = తండ్రి; అగు = అయిన; ధాత = బ్రహ్మ {ధాత - ధరించు వాడు, బ్రహ్మ}; కున్ = కి; తండ్రివి = తండ్రివి; దేవ = కృష్ణా; నీవు = నీవు; మా = మాయొక్క; తండ్రివిన్ = తండ్రివి; తల్లివిన్ = తల్లివి; పతివి = భర్తవి; దైవమవున్ = దేవుడవు; సఖివిన్ = స్నేహితుడవు; గురుండవు = గురువువి; ఏ = ఏ; తండ్రులు = తండ్రులు{తండ్రులు - అయిదుగురు తన్ను గన్నవాడు, ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు}; నీ = నీ; క్రియన్ = వలె; ప్రజల = లోకులను; ధన్యులన్ = ధన్యులనుగా; చేసిరి = చేసిరి; వేల్పులు = దేవతలు; ఐనన్ = అయినప్పటికిని; ఓ = ఓ; తండ్రి = తండ్రి; భవన్ = నీయొక్క; ముఖ = ముఖము అనే; అంబుజము = పద్మము; ధన్యతన్ = ధన్యతతో; కానరు = చూడలేరు; మా = మా; విధంబునన్ = వలె.

భావము:

తండ్రులందరికి తండ్రి యైన బ్రహ్మదేవునికి నీవు తండ్రివి. మా అందరికి తండ్రివి, తల్లివి, దైవానివి, భర్తవు, మిత్రుడవు, గురుడవు, సమస్తము నీవే; తండ్రులు ఐదుగురు (తన్ను గన్నవాడు, ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు) ఎవరు కూడ నీలాగ ప్రజలను పరమానంద భరితులను చేసి ధన్యులను చేయలేరు. దేవతలైనా మా లాగా నీ ముఖ పద్మాన్ని వీక్షించి కృతార్థులు కాలేరు.
శ్రీకృష్ణులవారు హస్తినాపురం నుండి కొద్దినెలలు గడచిన పిమ్మట ద్వారకకు మరలి వచ్చారు. బహు కాల వియోగం తరువాత కృష్ణ దర్శనం లభించిన ద్వారకాపురివాసులు ఇలా మ్రొక్కారు. ద్వారకాపట్టణ పాలన అంత ప్రజారంజకంగా సాగేది అన్నమాట. ఆ మనోరంజకానికి దీటైన పద్యరత్న మిది