పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తండ్రి క్రియ (9-336-క.)

  •  
  •  
  •  

9-336-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తండ్రిక్రియ రామచంద్రుఁడు
తండ్రుల మఱపించి ప్రజలఁ దారక్షింపన్
తండ్రుల నందఱు మఱచిరి
తండ్రిగదా రామచంద్రరణిపుఁ డనుచున్.

టీకా:

తండ్రి = కన్నతండ్రి; క్రియన్ = వలె; రామచంద్రుడు = శ్రీరాముడు; తండ్రులన్ = కన్నతండ్రులను; మఱపించి = మరిపించి; ప్రజలన్ = లోకులను; తాన్ = తను; రక్షింపన్ = ఏలుతుండగా; తండ్రులన్ = కన్నతండ్రులను; అందఱున్ = అందరు; మఱచిరి = మరచిపోయిరి; తండ్రి = తండ్రి; కదా = కదా; రామచంద్ర = రామయ్యతండ్రి అనెడి; ధరణిపుడు = రాజు {ధరణిపుడు - ధరణిని ఏలెడివాడు, రాజు}; అనుచున్ = భావించుచు.

భావము:

తండ్రిలా శ్రీరామచంద్రప్రభువు ప్రజలను కన్నతండ్రిని మించి కాపాడుతు రాజ్యం పాలించాడు. ప్రజ లందరు మా తండ్రి మహారాజు రామచంద్రుడే అని తమ తండ్రులను మరిచారు.
పోతన రామాయణం అనదగ్గ శ్రీరాముని కథ అనే ఘట్టంలోనిది ఈ అమృతధార. రామనామమే పరమ తారక మంత్రం. చెప్తున్నది బమ్మెర పోతనామాత్యులు. చమక్కులకు లోటేం ఉంటుంది. మన సంప్రదాయం ప్రకారం తండ్రులు అయిదుగురు (5) అని చెప్తారు. వారు (1) తనను కన్న తండ్రి, (2) ఉపనయనము చేసిన వాడు, (3) చదువు చెప్పిన వాడు, (4) విపత్తున కాపాడేవాడు, (5) అన్నము పెట్టి పోషించువాడు. ఇప్పుడు భావం మరొకసారి చూద్దాం. ప్రజలను వారి కన్నతండ్రులు ఎలా చూసుకొనేవారో అంత అపురూపంగానూ శ్రీరామ చంద్రుడు వారిని చూసుకునేవాడు. దానితో పైన తలచుకున్న తండ్రులను అయిదుగురను వారు మర్చిపోయేటంత గాఢమైన ప్రేమతో పాలించేవాడు. అవును మరి ఆ రామచంద్రప్రభువు విపత్తులనుండి కాపాడేవాడు, జీవనాధారం చూపి పోిషించేవాడు కదా మరి. అది మన పోతన్నగారి అలతి పొలతి పదాలలో అందాలు.