పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తనయులార ( 5.1-67-ఆ.)

  •  
  •  
  •  

5.1-67-ఆ.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నయులార! వినుఁడు రలోనఁ బుట్టిన
పురుషులకును శునకములకు లేని
ష్టములను దెచ్చుఁ గానఁ గామంబుల
లన బుద్ధి చేయలదు మీరు

టీకా:

తనయులారా = కుమారులారా; వినుడు = వినండి; ధర = భూమి; లోనన్ = అందు; పుట్టిన = పుట్టిన; పురుషుల్ = పురుషుల; కునున్ = కు; శునకముల్ = కుక్కల; కున్ = కైనను; లేని = లేనట్టి; కష్టములన్ = కష్టములను; తెచ్చున్ = తీసుకువచ్చును; కాన = కనుక; కామంబులన్ = కోరికల; వలనన్ = వలన; బుద్ధి = మనసు; చేయవలదు = పడవద్దు; మీరు = మీరు.

భావము:

బిడ్డల్లారా! ఈ లోకంలో పుట్టిన మానవులు కామానికి లొంగి పోతే కుక్కలకు కూడా రాని కష్టాలు ఎదురౌతాయి. అందుచేత కోరికలకు దూరంగా ఉండండి.
పురాతన కాలంలో ఋషభుడు మహా చక్రవర్తి, మహా జ్ఞాని. కొడుకులకు రాజ్యం అప్పజెప్పేసి అడవికి తపస్సుచేసుకోటానికి వెళ్తున్నాడు. ఆ సందర్భలో పుత్రులకు నీతిబోధ చేస్తున్నాడు. మన సహజకవి జాతీయాలు ప్రసుద్ధి చెందినవే. కుక్కపాట్లు అనే జాతీయానికి సమానంగా చెప్పిన ఈ పద్యంలోని నీతి ఇప్పటికి వర్తిస్తుంది.