పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తలగినదానం (10.1-319-క.)

  •  
  •  
  •  

10.1-319-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తలఁగినదానం దల" మనఁ
లఁగక యా చెలికి నాన లయెత్తఁగ "నీ
లఁగిన చోటెయ్యది" యని
యూఁచెన్ నీ సుతుండు గవె? మృగాక్షీ!

టీకా:

తలగినదానన్ = బహిష్టురాలను; తలము = తప్పుకొనుము; అనన్ = అనగా; తలగక = తప్పుకొనక; ఆ = ఆ; చెలి = ఇంతి; కిన్ = కి; నాన = సిగ్గు; తలయెత్తగ = కలుగునట్లుగా; నీ = నీ యొక్క; తలగిన = తొలగిన; చోటు = చోటు; ఎయ్యది = ఏది; అని = అని; తల = శిరస్సును; ఊచెన్ = ఊపెను; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; తగవె = ఇదిధర్మమేనా. కాదు; మృగాక్షీ = సుందరీ {మృగాక్షి - లేడికన్నులామె, స్త్రీ}.

భావము:

చక్కని లేడికన్నులవంటి కళ్ళు నీ కున్నాయిలే కాని ఓ యశోదమ్మ! ఇటు చూడు. ఈ అమ్మాయి “బహిష్ఠు అయ్యాను దూరంగా ఉండు” అంటే, నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలూపుతూ “బయిష్ఠు అయిన చోటేది” అని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు.