పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : తలగవు (8-28-క)

  •  
  •  
  •  

8-28-క.

  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లఁగవు కొండలకైనను
లఁగవు సింగములకైన మార్కొను కడిమిం
లఁగవు పిడుగుల కైనను
నిబలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.

టీకా:

తలగవు = తొలగిపోవు; కొండల్ = కొండల; కైనన్ = కి యయినను; మలగవు = తప్పుకొనవు; సింగముల్ = సింహముల; కైనన్ = కి యయినను; మార్కొనున్ = ఎదిరించుచుండును; కడిమిన్ = శౌర్యముతో; కలగవు = కలతచెందవు; పిడుగుల్ = పిడుగుల; కైనను = కి యయినను; ఇలన్ = భూమిపైన; బల = శక్తి; సంపన్న = సమృద్ధిగానుండుటచే; వృత్తన్ = వర్తించుటలయందు; ఏనుగుగున్నల్ = గున్న యేనుగులు.

భావము:

ఆ భూమిమీది ఏనుగు గున్నలు అమిత బలసంపన్నతతో ఎదిరించే శక్తి కలిగి ఉండటంతో, కొండలనైనా ఢీ కొట్టడానికి వెనుదీయవు, సింహాలనైనా సరే తప్పుకోకుండ ఎదిరించి నిలుస్తాయి, పిడుగుల నైనా లెక్కజేయక ముందడుగు వేస్తాయి.
అంతటి శక్తివంతమైన త్రికూట పర్వతంమీది ఏనుగుల పెద్ద గుంపుకు తండ్రి, నాయకుడు, రాజు మన గజేంద్రమోక్షంలోని గజరాజు.