పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఓ యమ్మ నీ కుమారుడు శ్ర10.1-329-క.)

10.1-329-క.

మ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు ననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా న్నల సురభులాన మంజులవాణీ!

టీకా:

ఓ = ఓహో; అమ్మ = తల్లి; నీ = నీ యొక్క; కుమారుడు = పుత్రుడు; మా = మా యొక్క; ఇండ్లను = నివాసములలో; పాలున్ = పాలు; పెరుగున్ = పెరుగు; మననీడు = బతకనీయడు; అమ్మా = తల్లీ; పోయెదము = పోతాము; ఎక్కడికైనను = మంరికొకచోటునకు; మా = మా యొక్క; అన్నల = నందాదుల యొక్క; సురభులు = గోవులమీద; ఆన = ఒట్టు; మంజులవాణీ = సుందరీ {మంజులవాణి - మృదువుగా మాటలాడెడి యామె, స్త్రీ}.

భావము:

ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు.
వెన్నదొంగ కృష్ణబాలుని అల్లరితో గోపికలు ఓపికలులేక యశోదమ్మ వద్ద మురిపాల ముద్దుకృష్ణునిపై చాడీలు చెప్పుకుంటున్నారు. ఏమా సహజకవి పద్య కవితా సౌకుమార్యం.