పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఒక సూర్యుండు (1-227-మ.)

1-227-మ.

సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు
పోలి నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న
న్య దంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూనరూ
కుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.

టీకా:

ఒక = ఒకే; సూర్యుండు = సూర్యుడు; సమస్త = సమస్తమైన; జీవులు = జీవులు; కున్ = కును; తాన్ = తను; ఒక్కొక్కఁడు = ఒక్కొక్కడుగా; ఐ = అయ్యి; తోఁచు = కనిపించు; పోలికన్ = విధముగ; ఏ = ఏ; దేవుండు = దేవుడు; సర్వ = సమస్తమైన; కాలము = కాలమునందు; మహా = గొప్ప; లీలన్ = లీలతో; నిజ = తననుండి; ఉత్పన్న = జనించిన; జన్య = జీవుల; కదంబంబుల = సమూహముల; హృత్ = హృదయ; సరోరుహములన్ = పద్మములలోను {సరోరుహము - సరసున పుట్టునది, పద్మము}; నానావిధ = అనేక రకములైన; ఆనూన = గొప్పవియైన; రూపకుఁడు = రూపముకలవాడు; ఐ = అయ్యి; ఒప్పుచు = ఒప్పుతు; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; హరిన్ = హరిని {హరి - సంగవ్రాతములను హరించువాడు, విష్ణువు}; నేన్ = నేను; ప్రార్ఠింతు = పూజింతు; శుద్ధుండను = పరిశుద్ధుడను; ఐ = అయ్యి.

భావము:

ఉన్న సూర్యుడు ఒక్కడు సకల జీవరాసులలో ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను.