పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఒకపరి జగములు (8-74-క.)

8-74-క.

పరి జగములు వెలి నిడి
యొపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
లార్థ సాక్షి యగు న
య్యలంకుని నాత్మమూలు ర్థిఁ దలంతున్.

టీకా:

ఒకపరి = ఒకసారి; జగములు = లోకములను; వెలినిడి = బయటపెట్టి, సృష్టించి; ఒకపరి = ఒకసారి; లోపలికిన్ = తనలోపలికి; కొనుచున్ = లయముచేసికొనుచు; ఉభయంబున్ = ఆ రెండు లోకములును; తాను = తనే; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; అర్థ = విషయములకు; సాక్షి = అతీతముగచూచువాడు; అగున్ = అయినట్టి; ఆ = ఆ; అకలంకున్ = దోషములులేనివానికి; ఆత్మమూలున్ = పరమాత్మను; అర్థిన్ = కోరి; తలంతున్ = ధ్యానము చేసెదను.

భావము:

ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.