పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తేనెసోనలు(అ-న) : ఒకనొకని చల్దికావిడి (10.1-456-క.)

10.1-456-క.

నొకని చల్దికావిడి
నొకఁడొకఁ డడకించి దాఁచు; నొకఁ డొకఁ డది వే
ఱొడొకని మొఱిఁగికొని చను
నొడొకఁ డది దెచ్చి యిచ్చు నుర్వీనాథా!

టీకా:

ఒకనొకని = ఒకానొకని యొక్క; చల్ది = చద్ది; కావిడిన్ = కావిడిని; ఒకడొకడు = ఒకానొకడు; అడకించి = వంచించి; దాచున్ = దాచివేయును; ఒకడొకడు = ఒకానొకడు; అది = దానిని; వేఱొకడొకని = మరింకొకని; మొఱగికొని = చాటుచేసుకొని; చనున్ = పారిపోవును; ఒకడొకడు = ఒకానొకడు; అది = దానిని; తెచ్చి = తీసుకొనివచ్చి; ఇచ్చున్ = ఇచ్చును; ఉర్వీనాథా = రాజా {ఉర్వీనాథుడు - ఉర్వి (భూమి)కి నాథుడు, రాజు}.

భావము:

ఒకతని చల్ది కావిడి మరొకతను అదిలించి లాక్కొని దాచేసాడు. ఇంకొకతను మరొకని అడ్డుపెట్టుకొని తీసుకుపోయాడు. మరింకొకతను ఆ కావిడిని తీసుకొచ్చి యిచ్చేసాడు.

  అలతిపొలతి పదాలతో కళ్ళకు కట్టినట్టు చెప్పటంలో చెప్పుకొదగ్గ పోతన, తన భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరించిన ఘట్టాలలో చల్దులు గుడుచుట ఒకటి. అలా మిక్కిలి ప్రసిద్దమైన యీ పద్యం ఆ ఘట్టంలోది.